Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మున్నూరు కాపుల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అంటూ టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి వీడీఏలను ప్రశ్నించారు. బీసీ కుటుంబాలను బహిష్కరిస్తారా? అని నిలదీశారు. నిజామాబాద్ జిల్లాలో షాపూర్ గ్రామంలో లో 80 మంది మున్నూరు కాపు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం అత్యంత దారుణమనీ, వెంటనే అదికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇంకా గ్రామాల్లో ఇంత దారుణమైన వివక్ష ఉందనీ, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన ఉందా? లేక రాచరికమా? నియంత పాలన సాగుతున్నదా? అని ప్రశ్నించారు.
వీడీఏలపై చర్యలు తీసుకోవాలి:కలెక్టర్కు
క్రాంతికుమార్ లేఖ
మున్నూరు కాపులను గ్రామ బహిష్కరణ చేసిన వీడీఏలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత, మున్నూరు కాపు యువక మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ క్రాంతికుమార్ కోరారు. ఈమేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు ఆయన లేఖ రాశారు. దేశమంతా ఆజాదీకా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న సమయంలో గ్రామాల్లో ఇలా సాంఘిక బహిష్కరణ చేయడం ఆవేదన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.