Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : సంచలనం రేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడైన నందకుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారించారు. దీంతో నందకుమార్‌ను విచారించడానికి కోర్టు ఇచ్చిన రెండ్రోజుల గడువు ముగిసింది. కాగా, రెండో రోజు కూడా నందకుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోదరుడు రితేశ్‌రెడ్డితో ఉన్న సంబంధాల గురించి అధికారులు విచారించినట్టు తెలిసింది. అంతేగాక, సెవెన్ హిల్స్ మానిక్ చంద్ యజమాని అభిషేక్ ఆవులతో నందకుమార్కున్న వ్యాపార లావాదేవీల గురించి కూడా ఈడీ అధికారులు క్షుణ్ణంగా విచారించినట్టు తెలిసింది. ముఖ్యంగా, వీరి మధ్య ఉన్న హౌటళ్ల వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాల గురించి కూడా ఈడీ విచారించినట్టు సమాచారం. ఈ మేరకు నందకుమార్ నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన ఈడీ అధికారులు వాటి వివరాలను నాంపల్లి కోర్టు అందజేయనున్నట్టు తెలిసింది.
ఈడీ విచారణకు హాజరుకాని పైలట్ రోహిత్‌రెడ్డి
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో మంగళవారం ఈడీ అధికారుల ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. నిజానికి గతంలో రెండురోజుల పాటు విచారణకు హాజరైన రోహిత్‌రెడ్డిని 27వ తేదీన తిరిగి హాజరు కావాలని ఈడీ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో మనీలాండరింగ్ అంటూ జరగలేదు కాబట్టి ఈ కేసును విచారించే అధికారం ఈడీకి లేదంటూ హైకోర్టులో రోహిత్‌రెడ్డి పిటిషన్ వేశారు.