Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : పోలీసు నియామకాలలో జరుగుతున్న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నియామక పరీక్షల్లో దేహదారుడ్య పరీక్షల నుంచి గర్భిణీ స్త్రీలకు మినహాయింపునిస్తున్నట్టు రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ వి.వి. శ్రీనివాస్‌రావు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గర్భిణీ స్త్రీలకు దేహదారుడ్య పరీక్షల నుంచి మినహాయింపు ఇచ్చామని ఆయన తెలిపారు. వీరు నేరుగా తుది పరీక్షకు (మెయిన్స్‌కు) హాజరు కావచ్చని ఆయన తెలిపారు. అయితే, తుది పరీక్ష ఫలితాలు వచ్చాక ఇందులో సెలక్ట్ అయిన అభ్యర్థులు నెల రోజుల్లోపల దేహదారుడ్య పరీక్షలను పాస్ కావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.