Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఇటీవల మరణించిన సినీనటులు కైకాల సత్యనారాయణ, తమ్మారెడ్డి చలపతిరావు కుటుంబ సభ్యులను తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పరామర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆయా ప్రాంతాల్లో ఉన్న వారి ఇండ్లకు వెళ్లారు.
ఈ సందర్భంగా ఇరువురి సినీనటుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతోపాటు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కంభంపాటి రామ్మోహన్ రావు, నాయకులు అట్లూరి సుబ్బారావు పాల్గొన్నారు. అంతకుముందు చంద్రబాబు పాల్గొన్న పార్టీ ఖమ్మం బహిరంగసభ సక్సెస్ అయిన నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనరతరం విందు ఇచ్చారు.