Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్
- 8 ఏండ్ల ప్రగతిప్రస్థానంలో ప్రభుత్వం వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో భర్తీ చేసిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు 2,24,142 అని సర్కారు ప్రకటించింది. ఇందులో ఈ ఎనిమిదేండ్ల కాలంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 1,33,000 అని వివరించింది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు 80,039 అని తెలిపింది. 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 'ఎనిమిదేండ్ల ప్రగతి ప్రస్థానం దేశానికే ఒక ప్రగతి నమూనా'అనే పేరుతో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నివేదికను విడుదల చేసింది. అందులో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పై వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.