Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఖాతాల్లో జమ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు బంధు డబ్బులు...బుధవారం రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. పది విడతలుగా రైతు బంధుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70.54 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,600 కోట్ల పంపిణీకి చర్యలు తీసుకుంది. గతంలో కంటే ఈసారి దాదాపు లక్ష మంది కొత్త రైతుల పేర్లు రైతుబంధు పథకంలో చేరాయి. ఈ ఏడాది డిసెంబర్ 20లోపు నమోదు చేసుకున్న వారు పెట్టుబడి సాయాన్ని పొందేందుకు అర్హులని ప్రభుత్వం తెలిపింది. దీంతో కటాఫ్ తేదీ కంటే ముందే పూర్తయిన భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి దరఖాస్తులు లక్షల్లో తమను అందాయని ని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ధరణి రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు యాసంగి రైతుబంధు పథకాన్ని ఎలాంటి షరతులు లేకుండా వర్తింపజేస్తున్నట్లు వారు తెలిపారు. 1.56 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందనుంది. ఇందులో భాగంగా ఒక్కో జిల్లాలో ఎంత మంది రైతులకు పంపిణీ చేయాలనే వివరాలను ఇప్పటికే ఆర్థిక శాఖ ఆయా జిల్లాల వ్యవసాయ అధికారులకు పంపింది. రైతు పథకం కింద రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.