Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
హైదరాబాద్లోని జేఎన్టీయూహెచ్లో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి సీఐ కిషన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన మనోజ్ కుమార్రెడ్డి తన కుటుంబంతో కలిసి కొంతకాలంగా కూకట్పల్లిలో నివాసముంటున్నాడు. అతని కూతురైన మేఘనారెడ్డి జేఎన్టీయూహెచ్లో బీటెక్(కంప్యూటర్ సైన్స్ విభాగం) 4వ సంవత్సరం చదువుతోంది. ఆమె కొంతకాలంగా డిప్రెషన్లో ఉందని.. అందుకు మందులు కూడా వాడుతోందని తెలిసింది. బుధవారం మధ్యాహ్నం 1:30 వరకు ఆమె తన తల్లితో కళాశాలలోనే ఉంది. అనంతరం 1:45కు మేఘన కళాశాలలోని సీఎస్ఆర్ బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి మృతిచెందింది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదువులో మేఘనా చురుకుగా ఉండేదని, ఎంసెట్లో ఆమెకు 200వ ర్యాంకు వచ్చిందని జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపాల్ జయలక్ష్మి తెలిపారు.