Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వేములు సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
రాష్ట్రంలోని ఆర్అండ్బీ రోడ్లు అద్దంలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆదేశించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎర్రమంజిల్ లోని ఆర్అండ్బీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యకార్యదర్శి శ్రీనివాస్‌రాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్ రవీందర్‌రావుతో సమీక్ష నిర్వహించారు. గత రెండు సీజన్లలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పిరియాడికల్ రెన్యూవల్, ప్లడ్ డ్యామేజ్ రోడ్ల కోసం ముఖ్యమంత్రి రూ. 2,500 కోట్లు మంజూరు చేశారని చెప్పారు.
కేసీఆర్ ఆదేశాల ప్రకారం వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల పునరుద్ధరణ పనులు వేగంగా నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ రోజు వరకు 70% పనులకు టెండర్లు పిలిచామని ,దశలవారిగా అగ్రిమెంట్లు చేస్తున్నామని వివరించారు. మిగతా ప్రక్రియ కూడా జనవరి ఐదో తేదీలోగా పూర్తీ చేసి జనవరి పది నుంచి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఇది వరకే వివిధ దశల్లో ఉన్న పనులను మార్చిలోపు పూర్తి చేయాలని కోరారు.