Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ పనులకు సంబంధించి ఐదు కన్సార్షియంలు అర్హత సాధించాయి. మెట్రో కారిడార్ రూట్‌మ్యాప్ పరిశీలించిన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు కొద్దిరోజుల కిందట జనరల్ కన్సల్టెంట్లను(జీసీ) ఆహ్వనించిన సంగతి తెలిసిందే. మొత్తం 31 కిలోమీటర్ల దూరం పనులను అత్యంత అధునాతన పద్ధతిలో చేపట్టేందుకుగాను ఇంజినీరింగ్ కన్సల్టెన్సీలను ఆహ్వనించగా.. ఈ మేరకు వివిధ దేశాల్లోని 13 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ, జాతీయ కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ఆయా సంస్థల సామర్థ్యాన్ని, నైపుణ్యతను పరిశీలించిన హెచ్ఏఎంఎల్ అధికారులు ఐదు కన్సార్షియంలను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆ కంపెనీలు పనుల నిర్వహణకు అర్హత సాధించినట్టు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం ప్రకటించారు. అలాగే, ప్రతిపాదన కోసం అభ్యర్థన(ఆర్ఎఫ్పీ) పత్రాలైన తదుపరి దశ బిడ్ పత్రాలు కన్సార్షియమ్లన్నింటికీ జారీ చేస్తామని, వారు తమ బిడ్లను వచ్చే నెల 20లోపు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
అర్హత సాధించిన కన్సార్షియంలు ఇవే..
- ఏఈకామ్ ఇండియా, ఈజిస్ రెయిల్(ఫ్రాన్స్), ఈజిస్ ఇండియా
- ఆయేసా ఇంజనెర్సియా వై ఆర్కెటెక్ట్రా (స్పెయిన్), ఆర్వీ అసోసియేట్స్, నిప్పాన్ కోయి (జపాన్),
- కన్సల్టింగ్ ఇంజినీర్స్ గ్రూప్, కొరియా నేషనల్ రైల్వే(సౌత్ కొరియా)
- సిస్ట్రా(ఫ్రాన్స్), ఆర్ఐటీఈఎస్, డీబీ ఇంజినీరింగ్ అండ్ కన్సల్టింగ్(జర్మనీ).
- టెక్నికా వై ప్రోయెక్టోస్(స్పెయిన్), పీనీ గ్రూప్ (స్విట్జర్లాండ్).