Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగిస్తే నిందితులకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్టా? అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, భూపాల్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొనడం అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు. ఈ కేసులు ఆ పార్టీ నేతలు నార్కొ అనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మూడేండ్లలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ఆయనకు సవాల్ చేశారు. బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.