Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చతికిలపడిన బీజేపీ పాలిత రాష్ట్రాలు : రెడ్కో చైర్మెన్ వై సతీష్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పునరుత్పాదక ఇంధనం (రెనవబుల్ ఎనర్జీ)లో తెలంగాణ రాష్ట్రం రికార్డులను అధిగమించిందని రెడ్కో చైర్మెన్ వై సతీష్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2వేల మెగావాట్ల టార్గెట్ ఇవ్వగా ఈ ఏడాది వరకు రాష్ట్రంలో 5078.73 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్టు తెలిపారు. కేంద్రం నిర్దేశించిన లక్ష్యానికన్నా 254 శాతం అదనంగా ఉత్పత్తిని సాధించామన్నారు. ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు లక్ష్యాలు సాధించలేక చతికిలబడ్డాయని విమర్శించారు. గుజరాత్ 108 శాతం, కర్నాటక 110 శాతం మాత్రమే అదనంగా ఉత్పత్తి చేశామన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రాలు పునరుత్పాదక ఇంధనంలో పూర్తిగా వెనకబడి పోయాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే దేశంలో కర్బన ఉద్గారాలు తగ్గించే లక్ష్యంతో ముందుకెళ్తోం దన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి కషికి ధన్యవాదాలు తెలిపారు.