Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కేజీకేఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లుతో పాటు సంఘం నేతలు ఎల్గూరి గోవిందు, వి. వెంకట నరసయ్య. బూడిద గోపి, ఎస్ రమేష్ గౌడ్, గౌని వెంకన్న, బాల్నే వెంకట మల్లయ్య, బోలగాని జయరాములు, బండకింది అరుణ్, గాలి అంజయ్య, పామనుగుల్ల అచ్చాలు తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ఇటీవల నీరా కేఫ్ కోసం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందిం చారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసేందుకు నిర్ణయించటం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. గీత కార్మికులు ఎదుర్కొం టున్న తక్షణ సమస్యలను వారు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకు పోయారు. 560 జీవో ప్రకారం సొసైటీలకు ఐదు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలనీ, కోటివరాల పథకంలో ఇచ్చిన భూములకు నీటి వసతి కల్పించి పొట్టి తాటి, ఈత, ఖర్జూర, జీనుగు మొక్కలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గీత కార్మికుల ప్రమాద నివారణకు సేఫ్టీ మోకులు ఇవ్వాలనీ, సభ్యులైన వారందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.