Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్కీమ్ వర్కర్ల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జనవరి ఆరో తేదీన దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ తెలిపారు. మన రాష్ట్రంలో ఎంపీ ఇండ్ల ముందు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆ నిరసనల్లో స్కీమ్ వర్కర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. నిత్యావసర సరుకుల ధరలు, మరోవైపు చాలీచాలని వేతనాలతో కేంద్రం, రాష్ట్రం ప్రవేశపెట్టిన స్కీమ్లలో పని చేస్తున్న వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతు న్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు పని చేస్తూ ఆ సంక్షేమ ఫలాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు అందించడంలో సమర్ధవంతంగా పనిచేస్తు న్నారని పేర్కొన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం వారిని చట్ట పరిధిలోకి తీసుకురావడానికి నిరాకరిం చడం దారుణమని తెలిపారు. స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్క రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని విమర్శించారు. వారి సమస్యలపై సీఐటీయూ అనేక పోరాటాలు చేస్తున్నదని గుర్తుచేశారు. 2013 మే నెలలో 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలనీ, కనీస వేతనమిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పినా కేంద్రం విస్మరించడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయివేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు.