Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.700 కోట్ల వ్యయం
- పనుల్ని పర్యవేక్షించిన రైల్వే సహాయ మంత్రి శ్రీమతి దర్శన జర్దోష్
నవతెలంగాణ - హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను వచ్చే 40 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా రూ.700 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్టు రైల్వే, ఔళి శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శన జర్దోష్ తెలిపారు. బుధవారంనాడామె దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా ఇతర సీనియర్ రైల్వే అదికారులతో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పనులను తనిఖీ చేశారు. 10వ నెంబర్ ప్లాట్ ఫామ్ ప్రవేశ మార్గం వద్ద మొక్కలు నాటారు. ఈ ప్రాజెక్ట్ ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహిం చారు. నిర్దేశించిన కాలపరిమితి లోగా పనులను పూర్తిచేయాలని ఆదేశిం చారు. అనంతరం అక్కడే ప్యాసింజర్ వెయిటింగ్ హాల్‌ను తనిఖీ చేశారు. ప్రయాణీకులతో మాట్లాడి స్టేషన్‌లోని సౌకర్యాలపై ఆరా తీసారు. జనపనార తో తయారుచేసిన బ్యాగ్‌లు, చేనేత, కలంకారి వస్త్ర ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్‌ను ఆమె సందర్శించారు. మార్కెటింగ్ అవకా శాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్క లేటర్లు, లిఫ్టులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్తోపాటు స్టేషన్ బయటి ఆవరణ, పార్కింగ్ ఏరియా సహా పలు ప్రాంతాల్లో కలియతిరిగారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తు న్నట్టు ఆమె తెలిపారు. ప్రయాణీకులకు అసౌ కర్యం కలగకుండా పనులను కొనసాగిం చాలని చెప్పారు. అనంతరం రైల్ నిలయం సమావేశ మందిరంలో ఆయా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.