Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలి : ఐద్వారాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ -నల్లగొండ
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 13వ మహాసభ జనవరి 6-9 వరకు కేరళలోని త్రివేండ్రంలో జరగనుందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డికొమరయ్య భవనంలో ఐద్వా సమావేశం జిల్లా అధ్యక్షులు పోలబోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మల్లు లకిë మాట్లాడుతూ.. ఆ మహాసభలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, మహిళలకు భద్రత కల్పించాలని, 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే వాటిపై చర్చించి పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్టు తెలిపారు. ఈ సమస్యలపై గ్రామస్థాయిలో మహిళలను చైతన్యం చేసి ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ, పట్టణ స్థాయిల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసి మహిళలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, విద్యలో, క్రీడల్లో, రాజకీయంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోతున్న మహిళల పట్ల వివక్ష, అణచివేత కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా.. సమాన పనికి సమాన వేతనం అందని పరిస్థితి ఉందనీ, ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారని చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పొదుపు గ్రూప్‌లలో ఉన్న 45 శాతం మంది మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మద్యం, మాదకద్రవ్యాలు, ఫోర్న్వెబ్సైట్లను, అశ్లీల సాహిత్యాన్ని నిషేధించాలని ప్రభుత్వాలను కోరారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట సరోజా, నిమ్మల పద్మ తదితరులు పాల్గొన్నారు.