Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఐక్య ఉద్యమాలు
- ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాలు
- వికలాంగులకు ఆహార భద్రత కల్పించాలి
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
వికలాంగుల పింఛన్ పెంచాలని, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి 15న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని ఎన్పీ ఆర్డీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గిరీష్ కీర్తి, మురళీధరన్ తెలిపారు. యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం దేశ్‌ముఖ్ గ్రామంలోని సెయింట్‌మేరీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఎన్పీఆర్డీ జాతీయ మూడో మహాసభ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధరల పెరుగుదలకనుగుణంగా వికలాంగుల పింఛన్ పెంచాలన్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలని అన్నారు. ప్రతి వికలాంగునికీ ఆహార భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నేషనల్ ట్రస్ట్ చైర్మెన్లను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద భావజాలాన్ని వికలాంగుల్లో జొప్పించేందుకు ప్రయ త్నిస్తుందని విమర్శించారు. మహిళా వికలాంగులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల వల్ల వికలాం గులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. ప్రభుత్వ రంగాలను ప్రయివేటుపరం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.