Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్య అతిథిగా కేరళ సీఎం పినరయి విజయన్
- రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా వ్యకాస రాష్ట్ర కార్యాలయంలో - - పతావిష్కరణ చేసిన జి.నాగయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖమ్మం జిల్లా కేంద్రంలో నేటి నుంచి 31 వరకు తమ సంఘం రాష్ట్ర మూడో మహాసభలు జరుగబోతున్నాయనీ, ఆ సందర్భంగా గురువారం ఖమ్మంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య పిలుపునిచ్చారు. ఆ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం ఆ సంఘం రాష్ట్ర కార్యాలయం వద్ద అరుణపతాకాన్ని నాగయ్య ఎగురవేశారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములుతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర మహాసభల నేపథ్యంలో అన్నిజిల్లాల్లో తమ సంఘం ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 56 లక్షల కమతాలున్నాయనీ, సాగులో కౌలు, సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పాలకులు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల గిట్టుబాటు ధర ఎక్కడా లభించడం లేదనీ, రైతులు వ్యవసాయం చేయలేని దుస్థితి నెలకొందని తెలిపారు. వ్యవసాయ పనులపైనే ఆధారపడి జీవిస్తున్న కూలీల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని వాపోయారు. రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం నిరంతరం పోరాడుతు న్నదని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కాపాడు కోవడం కోసం, వ్యవసాయ కూలీల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన పోరాటాలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణను రాష్ట్ర మహా సభలో తీసుకుంటామని చెప్పారు. గురు వారం జరిగే బహిరంగ సభలో కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు మాజీ ఎంపీ, ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రం, వ్యవ సాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రైతుసంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వర్రావు పాల్గొంటారని తెలిపారు. ఈ బహిరంగ సభలో వ్యవసాయ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కూలీల రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ బి.పద్మ, ఆ సంఘం నాయకులు ఆర్.ఆంజనేయులు, సాయిజీ, తదితరులు పాల్గొన్నారు.