Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ నేత నిరంజన్ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేల ఎర కేసులో సీఎం కేసీఆర్కు ముందుగా ఆధారాలు ఎలా వచ్చాయని టీపీసీసీ అధ్యక్షులు జి నిరంజన్ ప్రశ్నించారు. ఈ కేసు విష యంలో హైకోర్టు పలు కీలకమైన అంశాలను వెల్లడించిన విషయాన్ని ఆయ న గుర్తు చేశారు. సీఎంకు ఆధారాలు దొరకడం పెద్ద మిస్టరీగా మారింద న్నారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తనకు ఆధారాలెలా చేరాయో ప్రజలకు సమాధానం చెప్పా లని సీఎంను డిమాండ్ చేశారు.
తెలంగాణ అధికారులకు అన్యాయం
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్వీట్
ఐపీఎస్ పోస్టింగుల విషయంలో తెలంగాణ అధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు గురవారం ట్వీట్ చేశారు. డీజీపీతోసహా ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు కీలక పోస్టింగులు ఇచ్చినప్పటికీ... అందులో ఒక్కరు కూడా తెలంగాణ మూలాలు ఉన్న అధికారులు లేకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 'కల్వకుంట్ల రాజ్యంలో నిన్న పార్టీలో, నేడు పరిపాలనలో 'తెలంగాణం' మాయమైపోయింది' అని ఆవేదన వ్యక్తం చేశారు.
జనవరి 4న కాంగ్రెస్ శిక్షణా తరగతులు
కాంగ్రెస్ పార్టీ కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు జనవరి 4న శిక్షణా తరగతులను నిర్వహించనుంది. పార్టీ అన్ని స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు ఈ సమావేశంలో హాజరు కానున్నారు. వీటి నిర్వహణ కోసం పలు కమిటీలను ఆ పార్టీ నియమించింది.