Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నిర్వహణలో జనవరి ఒకటిన రవీంద్రభారతి ప్రధాన వేదికపై బహుజన కాళోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తానా ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షుడు ప్రసాద్ తోట కూర, తార ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు సంకే రాజేష్‌తో కలసి రవీంద్రభారతి సమావేశ మందిరంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒకటో తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు బహుజనవర్గాలకు చెందిన సంప్రదాయ, జాన పద కళా రూపాల ప్రదర్శన నిర్విరామంగా ఉంటుందని వారు ఈ సందర్భంగా తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 30 కళా బృందాలు, 300 మంది కళాకారులు పాల్గొంటారని తెలిపారు. బహుజన వర్గాలకు చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా బి.సి. కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళా భరణం కృష్ణమోహన్‌రావును బహు జనబంధు బిరుదుతో తానా సభ్యులు సత్కరిస్తారని అన్నారు. బహు జనుల నుంచి పద్మ పురష్కారాలు అందుకొన్న తెలుగు ప్రముఖుల సత్కారం, ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు స్వీయ రచన బహుజన శతకం నుంచి పద్యాల ఆలాపన వంటి భిన్న కార్యక్రమలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా బి.సి.సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, సాంస్కృతిక సారధి చైర్మెన్ రసమయి బాలకిషన్, లావు అంజయ్య, తానా కార్యవర్గంతోపాటు ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.