Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: విద్యుత్ స్కూటర్ల తయారీదారు ఎథర్ ఎనర్జీ తెలంగాణలో తన మూడవ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఇది దేశంలో తమకు 77వ అవుట్లెట్ అని పేర్కొంది. కొత్తపల్లిలో ప్రారంభించిన నూతన సెంటర్లో తమ ప్రతిష్టాత్మకమైన 450 ఎక్స్, 450 ఫ్లస్లను టెస్ట్ రైడ్, కొనుగోలు కోసం ఎధర్ స్పేస్ వద్ద లభ్యమవుతాయని తెలిపింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 750కు పైగా ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లను కలిగి ఉంది.