Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ అకాడమీ చైర్మన్ టీఎస్ఎల్పీఆర్బీకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్ఐ, కానిస్టేబుల్ నియమకాల్లో రన్నింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్‌లో అవకాశం కల్పించాలని నార్సింగి పోలీస్ అకాడమీ చైర్మన్, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులను ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కోరాయి. ఈ మేరకు గురువారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ రెడ్డి, లెనిన్, వేణు, డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావీద్, అభ్యర్థులు నరేష్, శివ తదితరులు వినతిపత్రాన్ని సమర్పించారు. నియమకాల్లో భాగంగా దేహదారుఢ్య పరీక్షలో రన్నింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ రాసుకునే అవకాశం కల్పించాలని వారు కోరారు. డిజిటల్ ద్వారా ఎత్తు కొలతలు తీసుకోవడంతో సాంకేతిక లోపంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు.