Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ప్రజా సమస్యలను, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను పరిష్కరించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగు ఆదేశాలివ్వాలని కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పార్టీ ఇన్చార్జీ కంభంపాటి రామ్ మోహన్ రావు, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నరసింహులు, అధికార ప్రతినిధులు నన్నురి నర్సిరెడ్డి, జ్యోత్స్న, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర నాయకులు అట్లూరి సుబ్బారావు, కాసాని వీరేశ్, రాఘవ ప్రతాప్, బండారి వెంకటేష్, కాసాని సాయి రాజేంద్రప్రసాద్, మారయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.