Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. నామినల్ రోల్స్ నుంచి పరీక్షలు పూర్తి అవ్వడంతో పాటు ఫలితాలను వెల్లడించే నాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. ప్రయివేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు ఉతీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డు ఇంఛార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.