Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్ఐ, కానిస్టేబుల్ దేహదారుడ్య అర్హతా విభాగాల్లో అవకతవకలపై వెంటనే విచారణ జరిపించి.. సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అవకతవకలకు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మెన్ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలే కారణమని తెలిపింది. ఇలాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆ సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న నేతలను ముందుకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం హిమాయత్‌నగర్ వై జంక్షన్ కూడలి వద్ద ఏఐవైఎఫ్ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్.బాలకృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.