Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
నవతెలంగాణ- హైదరాబాద్ బ్యూరో
రాష్ట్రంలోని నిరుద్యోగులకు కొత్త సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 18 శాఖల్లో ఖాళీగా ఉన్న 783 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియమొదలవుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పోస్టులు - 11, కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ - 59,ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో నయిబ్ తహసిల్దార్ పోస్టులు - 98, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో సబ్-రిజిస్ట్రార్ ఖాళీలు - 14, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఫర్ కో-ఆపరేషన్ పోస్టులు - 63,కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఖాళీలు - 09,పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మండల పంచాయత్ ఆఫీసర్ - 126 ,ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్- 97,హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో- అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ - 38,జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీలు - 165,లెజిస్లేటివ్ సెక్రెటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 15,ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 25,న్యాయ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 07,తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 02,జువెనైల్ కరెక్షనల్ సర్వీసెస్ డిస్ట్రిక్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు - 11, బీసీ సంక్షేమ శాఖలో అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ - 17,గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 09
,షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 17 ఖాళీలు ఉన్నాయి.