Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం : వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- కాగజ్‌నగర్‌లో 30, బెల్లంపల్లిలో 100 పడకల ఆస్పత్రులు ప్రారంభం
నవతెలంగాణ - కాగజ్‌నగర్
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శమని, కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కుమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో 30 పడకల ఆస్పత్రి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 100 పడకల ఆస్పత్రి, డయాలసిస్ సెంటర్‌ను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ, రైతుబంధు పథకాలకే కేంద్రం పేర్లు మార్చి అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని తాగేందుకు శుద్ధ జలం అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ అందించామని తెలిపారు. ఆరోగ్యం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పారిశుధ్య నిర్వహణపై ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ దండె విఠల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్స్ కోవ లక్ష్మి, నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టర్లు భారతిహోళికేరి, రాహుల్‌రాజ్ పాల్గొన్నారు.