Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి దాకా మద్యం షాపులకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసిఆర్ పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా శుక్రవారం ప్రగతి భవన్‌కు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీభవన్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ మద్యం షాపులు అనుమతి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సర్కారు ప్రజలను తాగుబోతులుగా మార్చుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిపోయిందనీ, మహిళల రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరచి ప్రజలను లూటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. మైనర్లపై లైంగికదాడులు జరుగుతుంటే, అర్ధ్థరాత్రి వరకు మద్యం షాపులు తెరిచేందుకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. డిసెంబర్ 31న మద్యం షాపులు పూర్తిగా ముసేయాలనీ డిమాండ్ చేశారు.