Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామ పంచాయతీలను బతకనివ్వాలనీ, వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చొద్దని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేయాల్సిన స్థానిక సంస్థలను, వాటి పాలనను కేంద్ర,రాష్ట్ర పాలకులు ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. నిధుల లేమితో, విధుల కొరతతో అది సతమతమవుతున్నాయని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలకు ఇచ్చిన 15 వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిందనీ, కనీసం సర్పంచ్లకు తెలియకుండా దొడ్డి దారుల్లో తరలించిందని తెలిపారు.వీథి దీపాలు, మురుగు కాల్వలను శుభ్రం చేయ లేని దీనావస్థలో గ్రామ పంచాయతీలు న్నాయని పేర్కొన్నారు. తద్వారా సర్పుంచులను శక్తి లేకుండా చేసి ప్రజల ముందు వారిని అవమానిస్తున్నారని తెలిపారు.