Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర నూతన డీజీపీగా అంజనీ కుమార్ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12.10 నిమిషాల ప్రాంతంలో ఆయన డీజీపీ కార్యాలయానికి వచ్చి రిటైరవుతున్న డీజీపీమహేందర్రెడ్డి నుంచి చార్జ్‌ను స్వీకరిస్తారు. అనంతరం ఆయన తోటి సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి మహేందర్ రెడ్డికి వీడ్కోలు పలుకుతారు. ఈ సందర్భంగా సాంప్రదాయం ప్రకారం సుందరంగా అలంకరించిన వాహనంపై మహేందర్‌రెడ్డిని కూర్చోబెట్టి దానికి ఇరువైపుల కట్టిన తాళ్లను రథం మాదిరిగా లాగుతూ ప్రధాన గేటు వరకు ఐపీఎస్ అధికారులు తీసుకెళ్తారు. అక్కడి నుంచి మహేందర్‌రెడ్డి తన కారులో తన నివాసానికి బయలు దేరి వెళ్తారు.