Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తన స్వగ్రామమైన వెలుగుపల్లిలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మల్లెపాక రాములు కూతురు శ్వేతకు తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ ఆపన్న హస్తం అందించారు. శ్వేతకు టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు లభించింది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు తన కూతురు కాలేజీ హాస్టల్ ఫీజు కట్టలేక పోయాడు. దీంతో ఈ విషయం రాజీవ్ సాగర్ దృష్టికి రాగా నాలుగేళ్లపాటు హాస్టల్ ఫీజును తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు.దాంతో పాటు ఆమెకు ఏడాదికి అయ్యే హాస్టల్ ఫీజు రూ. 25 వేలను శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అందజేశారు. చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని రాజీవ్ సాగర్ విద్యార్థినికి భరోసా ఇచ్చారు. బాగా చదివి ఇంజనీరింగ్‌లో రాణించి ఊరి పేరు నిలబెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా శ్వేత కుటుంబసభ్యులు రాజీవ్ సాగర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా పీఆర్టీయూ జనరల్ సెక్రటరీ ధర్మారపు వెంకటయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మల్లెపాక రాములు, వెలుగుపల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గుడిపాటి కమలాకర్, మాజీ విద్యా కమిటీ చైర్మెన్ మల్లెపాక యాదగిరి పాల్గొన్నారు.