Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని పలు పట్టణాల మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వికారాబాద్, కాచిగూడ, హైదరాబాద్, నర్సాపూర్, కాచిగూడ స్టేషన్ల నుంచి 16 రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ రైళ్లు జనవరి 7నుంచి 18వ తేదీ వరకు ఆయా రూట్లలో తిరుగుతాయి. డిసెంబర్ 31 నుంచి ఈ రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు.