Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నవతెలంగాణ-అడిక్మెట్
మునుషుల జీవితమే పాట అని కవి, గాయకులు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. పాట మానవ సంబంధాలపై ప్రభావం, ప్రాముఖ్యతపై హైదరాబాద్ బుక్ ఫెయిర్లో శుక్రవారం చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాట లేకుంటే తానులేనన్నారు. పాట మానవ సంబంధాలను మరింత దగ్గర చేస్తుందని చెప్పారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. పాట నక్సల్బరీ ఉద్యమాన్ని నడిపించిందని, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందని తెలిపారు. ఉద్యమాలను పుట్టించేదే పాట అన్నారు. పాట లేకుండా మనుషుల మధ్య అనుబంధం ఏర్పడదని, శ్రమ మీద అనేక పాటలు మనల్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. గాయకుడు మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. పాట ప్రజలను చైతన్యం చేస్తుందని, ఒక ప్రభుత్వాన్ని నిట్టనిలువుగా చీలుస్తుందని అన్నారు. నాటి సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించింది పాటేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జూలూరి గౌరీ శంకర్, అభినయ శ్రీనివాస్, కోదారి శ్రీనివాస, గిద్దె రామనరసయ్య, దయా నర్సింగ్, బోడ చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.