Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూఇయర్ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల మ్యధ్యకాలంలో పబ్బుల నుంచి డ్రమ్స్, పాటలు, డ్యాన్స్‌ల శబ్దాలు వెలుడకూడదని హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అనుబంధ పిటిషన్లను కొట్టేసింది. జూబ్లీహిల్స్ పబ్‌లు జనావాసాల మధ్య ఉన్నాయనీ, అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఫర్జీ కేఫ్, అమ్నీసియా లాంజ్ బార్, బ్రాడ్వే ది బ్రూవరీ పబ్‌ల విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సన్‌బర్న్ సూపర్క్లబ్ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ భాస్కర్‌రెడ్డి డివిజన్ బెంచ్ శుక్రవారం డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
జస్టిస్ షమీమ్ అక్టర్కు ఘన వీడ్కోలు..
హైకోర్టులో సీనియర్న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా శుక్రవారం హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన ఫుల్‌కోర్టు సమావేశమై వీడ్కోలు చెప్పింది.
సునీల్ కేసుపై తీర్పు వాయిదా
అభ్యంతర కర పోస్టులకు సంబంధించి దాఖలైన కేసులో తనపై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలనీ, 41ఎ నోటీసులను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు దాఖలు చేసిన రిట్‌పై శుక్రవారం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.