Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్రౌపది ముర్ముకు ఘనంగా వీడ్కోలు
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ శీతాకాల విడిది ముగిసింది. శుక్రవారం హైదరాబాద్ హకీంపేటలోని విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై సౌందరన్తోపాటు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం రాష్ట్రపతికి నూతన పట్టు వస్త్రాలను, జ్ఞాపికను, ఫలాలను మంత్రి అందజేశారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాష్ట్రపతికి వెండి వీణ జ్ఞాపికను బహుకరించారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు రాష్ట్రపతి నూతన పట్టు వస్త్రాలతో పాటు జ్ఞాపికను అందజేయాల్సిందిగా రాష్ట్రపతి ...మంత్రి సత్యవతి రాథోడ్‌కు అందించారు. శీతాకాల విడిదిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులపాటు పర్యటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆమెకు సమన్వయకర్తగా సత్యవతి రాథోడ్ వ్యవహరించారు.