Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు..
- బైరి నరేష్‌పై కేసు నమోదు
నవతెలంగాణ-కొడంగల్
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖలు చేసిన భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్య క్షులు బైరి నరేష్‌పై వికారాబాద్ జిల్లా కొడం గల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ కోటిరెడ్డి, కొడంగల్ రవిగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల కిందట కొడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో నిర్వహించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బైరి నరేష్ పాల్గొని అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది వైరల్‌గా మారడంతో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బైరి నరేష్ అనుచరుడు వీడియో తీయడంతో అతనిపై దాడి చేశారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని అతన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బైరి నరేష్‌పై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బైరి నరేష్‌పై అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేశారు. కాగా, భైరి నరేష్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.