Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మీడియా అకాడమి చైర్మెన్ అల్లంనారాయణ, ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ - అడిక్మెట్
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గురించి రాయడం గొప్ప అంశం అని తెలంగాణ మీడియా అకాడమి చైర్మెన్ అల్లంనారాయణ, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. డాక్టర్ కె.జి సంధ్యా విప్లవ్ రచించిన ఆధ్యంతాలు కవితను హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫెయిర్లో ప్రొఫెసర్ హరగోపాల్, అల్లంనారాయణ, కొండవీటి సత్యవతి శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో పాలకవర్గాలు విధ్వంసానికి పాల్పడ్డాయన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా వేల మంది నిర్వాసితులయ్యారనే విషయాన్ని సంధ్యా విప్లవ్ తన కవిత ద్వారా చెప్పారన్నారు. అల్లంనారాయణ మాట్లడుతూ.. రాష్ట్ర సాధన పోరాటం పోలవరం ప్రాజెక్ట నిర్మాణాన్ని వ్యతిరేకించిందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరి శంకర్, మోర్తల విమల, డా.పసునూరి రవీందర్, మెర్సి మార్గరెట్ పాల్గొన్నారు.