Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి
- వనపర్తి కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవ తెలంగాణ- వనపర్తి
కొన్ని ఏండ్లుగా అంగన్వాడీలకు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిన టీఏ, డీఏ చెల్లించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం వనపర్తి జిల్లా పాల కేంద్రం మరికుంట నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. 2016 నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యలక్ష్మి, మెనూ చార్జీలు పెంచాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ఉద్యోగులుగా గుర్తించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. కేంద్రం పెంచిన వేతనాలు వెంటనే ఖాతాలో జమ చేయాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు ఐదు లక్షలు, హెల్పర్లకు మూడు లక్షలు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సెంటర్‌కు నేరుగా రెండు సిలిండర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా మొదటి వారంలోనే వేతనాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు, కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, సూర్యవంశం రాము, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శారద, నారాయణమ్మ, కవిత, భాగ్యలక్ష్మి, రమాదేవి, జ్యోతి, లక్ష్మీదేవి, మాధవి పాల్గొన్నారు.