Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌ను ముట్టడించిన పోడు రైతులు
- భూములను లాక్కుంటే సహించేది లేదు: సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
పోడు భూముల హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ హక్కులు కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో పోడు భూములకు హక్కుపత్రాల కోసం 12,500 మంది దరఖాస్తు చేసుకుంటే.. 300 మందికే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రావ్ భవనం నుంచి శుక్రవారం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌ను ముట్టడించారు. రెండు గంటలపాటు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో తరతరాలుగా పోడు భూములను సేద్యం చేసుకుని జీవనం గడుపుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతాంగం పట్ల ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని విమ ర్శించారు. సర్వేలు సక్రమంగా చేయ కుండా.. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ పోడు హక్కుపత్రాలు ఇచ్చేవరకు ఎర్రజెండా పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఒకపక్క పోడు భూములు సేద్యం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు ఇస్తామని ముఖ్య మంత్రి చెబు తుంటే.. ఆయా జిల్లాల్లో అధికారులు మాత్రం రైతాంగం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల దరఖాస్తులు పోడు భూముల కోసం పెట్టుకున్నారని, హక్కు పత్రాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులచే గిరిజనులపై దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. గిరి జనుల పక్షాన.. హక్కు పత్రాలు ఇచ్చే వరకు తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మోతి లాల్‌కు వినతిపత్రం అంద జేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి వర్గం పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు వారి శ్రీని వాసులు, గీత, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేశ్య నాయక్, శంకర్ నాయక్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు మల్లేష,్ అశోక్, శివ వర్మ, రామయ్య, దశరథం, అశోక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.