Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5న శ్రీచైతన్య స్కూల్ నిర్వహణ
హైదరాబాద్ : శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు జనవరి 5వ తేదిన 1 నుంచి 100 గుణింతాల వరకు చూడకుండా చెప్పడం ద్వారా నూతన ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పడానికి సిద్దం అవుతున్నారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 10 రాష్ట్రాలలోని 1000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. విద్యార్థుల వయస్సు కూడా 2.5 నుంచి 7 సంవత్సరాల లోపు వారేనని తెలిపారు. 100 రోజుల శిక్షణతోనే 100 మ్యాథ్ టేబుల్స్‌ను, 100 నిమిషాల్లో అప్పజెప్పేలా ఈ రికార్డ్ ఉంటుందన్నారు. దీనిని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు పర్యవేక్షిస్తారని తెలిపారు. దీన్ని రికార్డ్ చేసి అనంతరం సర్టిఫికెట్‌ను ప్రధానం చేస్తారన్నారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలోనే చిన్నారుల నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇది దోహదం చేయనుందన్నారు. ఇప్పటికే తమ విద్యార్థులు అనేక పరీక్షల్లో రికార్డులను నమోదు చేశారని గుర్తు చేశారు.