Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘన స్వాగతం పలికిన మంత్రులు
- పూర్ణకుంభంతో అర్చకుల స్వాగతం
- అడుగడుగునా పోలీసుల బందోబస్తు
నవతెలంగాణ - భువనగిరి
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం యాదాద్రిని సందర్శించారు. రాష్ట్రపతికి మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ పమేలా సత్పత్తి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక వాయుసేనా హెలికాప్టర్ లో యాదాద్రికి చేరు కున్నారు. మొదటిసారి ఆలయానికి వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు సన్నాయి మేళతాళాలతో ఆలయ పండితులు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాల యంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ముర్ము దర్శించు కున్నారు. ఆలయ వేద పండితులు సంకల్పం, సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. చతుర్వేద ఆశీర్వ చనం అంద జేశారు. ఆలయ పరిస రాలను రాష్ట్రపతి పరి శీలించారు. దేవాలయ పూర్వ, అధునాతన నిర్మాణాలను, స్థల సేకరణ, కాటేజీల వస తులు అభివృద్ధిని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ విశిష్టతను వివరించారు. రాష్ట్రపతికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి లక్ష్మి నరసింహ స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. సూమారు గంటపాటు యాదాద్రిలో ఉన్నారు. అనంతరం రాష్ట్రపతి తిరుగు ప్రయాణమయ్యారు.
భారీ బందోబస్తు..
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము యాదాద్రికి వచ్చిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. రాచ కొండ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఆరు గురు డీఎస్పీ లు, 15 మంది ఏసీ పీలు, 100 మంది ఎస్సైలు, 1200 పోలీస్‌లు బందో బస్తు లో ఉన్నారు. వీరిలో రెండు వందల మంది మహిళా పోలీసులు ఉన్నారు. యాగ స్థలంలో మూడు హెలి పాడ్లు నిర్మించారు. యాదగిరి గుట్టలో ర్యాలీలు, సభలు, సమావేశాల నిషేధంతోపాటు 144 సెక్షన్ అమలు పరిచారు. యాదగిరి గుట్టకు మూడు వైపుల నుంచి వచ్చేమార్గాల్లో వాహనాలను నిలిపివేశారు.
దేవాలయం ప్రత్యేక అలంకరణ
దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో, పెద్ద ఎత్తున పూల అలంకరణ చేశారు. ప్రాంగణంలో రెడ్ కార్పెట్ పరిచారు. ప్రత్యేకంగా పారిశుధ్య కార్మికులను నియమించారు. వివిధ విభాగాలకు చెందిన ఆరుగురు వైద్యులు, నర్సు, బ్లడ్ డోనర్‌ను అంబులెన్స్, ఫైర్ ఇంజన్‌ను, రెవెన్యూ సిబ్బందిని అందుబాటులో పెట్టారు.
ప్రజలకు ఆర్జిత సేవలు నిలిపివేత
రాష్ట్రపతి రాక నేపథ్యంలో తెల్లవారు జామున సుప్రభాత సేవల నుంచి మధ్యాహ్నం నివేదన ఆర్జిత సేవలకు సామాన్య ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. నూతన సంవత్సరం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. వారు వసతి గృహాల్లో ఉన్నారు. ముందస్తుగా కొండపై, కొండ కింద వ్యాపార దుకాణాలను మూసివేయించారు.