Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1,365 గ్రూప్-3 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్సు పోస్టులకు మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు, 1,365 గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీయస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేశాయి. స్టాఫ్ నర్సు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులను భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ (81 పోస్టులు), డిజబుల్డ్, సినీయర్ సిటిజెన్స్ వేల్ఫేర్ (8) తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్స్ (127), బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్( 197), ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ (74), సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ (124), తెలంగాణ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్(13 పోస్టులు) భర్తీ చేయనున్నారు.
ఇక గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ మధ్యలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 783 గ్రూప్-2 పోస్టులకు నిన్న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. మరోవైపు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది.
రెండో దశ సీట్ల కేటాయింపునకు తేదీల ఖరారు
డీఈఈసెట్లో ర్యాంకు వచ్చి, ఇప్పటికే వెబ్ ఆప్షన్ ఇచ్చిన అభ్యర్థులకు సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సిలింగ్ తేదీలను డీఈఈసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి మూడు నుంచి జనవరి 24 వరకు వివిధ దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
మాతా, శిశు మరణాలు తగ్గాయి...
రాష్ట్ర ప్రభుత్వంపై యూనిసెఫ్ ప్రశంసలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ప్రసవసేవలను అందించడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అభినందించింది. తెలంగాణలో అందిస్తున్న ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయనీ, సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని పేర్కొంది.
'ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎ హెల్థీ స్టార్ట్' హాష్ ట్యాగ్‌తో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో జన్మించిన నవజాత శిశువు ఫొటోను జత చేసి, యునిసెఫ్ ట్వీట్ చేసింది.