Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
ఖమ్మం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
వ్యవసాయ కార్మికులను చైతన్యపరిచేలా పోరాటాలు చేయబోతున్నట్టు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రామలు తెలిపారు. శుక్రవారం ఖమ్మంలోని వేదగిరి శ్రీనివాసరావు నగర్ (భక్తరామదాసు కళాక్షేత్రం)లోని అమరవీరుల ప్రాంగణంలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలో ప్రధాన కార్యదర్శి నివేదికను ఆయన ప్రవేశపెట్టారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోతుండటం, మరోవైపు యాంత్రీకరణతో కూలీలకు పనులు దొరకడం చెప్పారు. మరోవైపు కేంద్రం చర్యలతో ఉపాధి హామీ చట్టం కూడా సరిగ్గా అమలు కావడం లేదన్నారు. దీంతో వ్యవసాయ కార్మికులు పట్టణాలకు వలస పోతున్నారని చెప్పారు. పట్టణప్రాంతాల్లోని అసంఘటిత కార్మికులను చైతన్యం చేయాల్సిన బాధ్యత వ్యవసాయ కార్మికులపైనా ఉందన్నారు. తెలంగాణలో వ్యవసాయ కూలీలకు రూ.250 నుంచి 300లోపే వేతనం పడుతున్నదన్నారు. కనీసవేతన చట్టం రివైజ్ కోసం పోరాటం చేయబోతున్నట్టు తెలిపారు. గ్రామాల్లో కూలిపోరాటాలను ఉధృతం చేయాలన్నారు. దేశంలో సాంస్కృతిక విప్లవం కూడా రావాలన్నారు. వ్యవసాయ కార్మికుల్లో రాజకీయ చైతన్యం కూడా పెంపొందించాల్సిన బాధ్యత వ్యవసాయ కార్మిక సంఘంపై ఉందని చెప్పారు.