Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిగి సబ్ జైల్‌కు తరలింపు
- జైల్ వద్ద ఉద్రిక్తత, అయ్యప్ప స్వాములను అడ్డుకున్న పోలీసులు
నవతెలంగాణ-కొడంగల్, పరిగి
అయ్యప్ప స్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి నరేష్‌కు వికారాబాద్ జిల్లా కొడంగల్ కోర్టు జడ్జి 14రోజుల రిమాండ్ విధించారు. అతన్ని పరిగి సబ్ జైలుకు తరలించారు. పరిగి సీఐ, కొడంగల్ ఎస్ఐ రవిగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బైరి నరేష్‌పై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు. దీంతో శుక్రవారం బైరి నరేష్‌పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కొడంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న బైరి నరేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు నాలుగు టీంలను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా జనగామలో శనివారం ఆయనను అరెస్టు చేశారు. అక్కడి నుంచి కొడంగల్‌కు తరలించారు. బైరి నరేష్‌తోపాటు అంబేద్కర్ యువజన సంఘం రావులపల్లి గ్రామ అధ్యక్షులు హనుమంతును కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. భారీ బందోబస్తు మధ్యన పోలీసులు వారిని పరిగి సబ్‌జైల్‌కు తరలించారు.
పరిగి సబ్‌జైల్ వద్ద ఉద్రికత్త
బైరి నరేష్‌ను సబ్ జైల్‌కు తరలించే క్రమంలో జైల్ వద్ద ఉద్రికత్త నెలకొంది. పోలీసులు కొడంగల్ నుంచి పరిగి జైల్‌కు తీసుకొచ్చే క్రమంలో అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేశారు. బైరి నరేష్‌ను తమకు అప్పగించాలని జైలు గేటు ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు.