Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అశాస్త్రీయ పురాణ కథను విమర్శించినందుకు భారత నాస్తిక సమాజం నాయకుడు హేతువాది బైరి నరేష్, ఆయన మద్దతుదారులపై భౌతిక దాడులు చేయడమే గాక అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే చర్యగా కేవీపిఎస్ భావిస్తున్నదని తెలిపారు. అయ్యప్ప స్వాములు ముసుగులో ఆర్ఎస్ఎస్, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ తరహా కుట్రలు చేస్తున్నదని పేర్కొన్నారు.