Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమాజం కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్న జర్నలిస్టులు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రసంశించారు. జర్నలిజమనేది ఒక గొప్ప వృత్తి అనీ, అయితే కాలంతో పోటీ పడుతూ పాత్రికేయులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలని ఆయన సూచించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ (సోమాజీగూడ)లో శనివారం రాత్రి నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా మాట్లాడారు. జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్‌షిప్పుల పంపిణీని ఆయన ప్రారంభించారు. పాత్రికేయుల ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధిం చిన అంశం ముందుకెళుతున్నదనీ, ఆ సమస్య త్వరగా పరిష్కా రమయ్యేందుకు వీలుగా తన వంతు కృషి చేస్తానంటూ హామీ నిచ్చారు. జర్నలిస్టుల పిల్లల కోసం బాలలత రూ.ఐదు లక్షల స్కాలర్ షిప్పులను ఇస్తున్నారనీ, తాను కూడా ప్రతీయేటా రూ.ఐదు లక్షలను ఇవ్వటం ద్వారా తోడ్పాటునందిస్తానని వివరించారు.