Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గతాన్ని సమీక్షించుకుంటూ.. వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ.. భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింతగా తీర్చిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణతోపాటు దేశ ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 2023లో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాలంటూ ఆకాంక్షించారు. యువత నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని ముందుకు సాగాలని అభిలషించారు. జీవితం పట్ల సరైన దృక్పథం.. సంకల్ప బలం ఉంటేనే లక్ష్య సాధనలో సఫలీకృతమవుతామని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయనతోపాటు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.