Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు స్కూళ్లతో పోటీపడేలా షెడ్యూల్
- మంత్రి సబితకు టీఎస్జీహెచ్ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విధాన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయు లతోపాటు, ఉపా ధ్యాయ సంఘా లతో చర్చించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శనివారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం కలిసి వినతి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వమే ఆశిస్తున్న జారు ఫుల్ లెర్నింగ్ విధానానికి విరుద్ధంగా షెడ్యూల్ ఉందని తెలిపారు. ప్రయివేటు పాఠశాలలు అనుసరిస్తున్న నిర్భంద విద్యా బోధనా విధానాన్ని నియంత్రించాల్సిన అధికారులు వాటితో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడడానికి తయారుచేసిన షెడ్యూల్లా ఉందని పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం నిబంధనలను అతిక్రమించి తయారు చేసిన షెడ్యూల్ అని తెలిపారు. పాఠశాలల పని వేళలు, సెలవు రోజుల్లో పాఠశాలల నిర్వహణ తదితర అంశాలను నిబంధనల ప్రకారం రీ షెడ్యూల్ చేయాలని కోరారు. ప్రయివేటు పాఠశాలలకు పంపే విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలకి రెండు/మూడు రకాల టిఫిన్ బాక్సులు పెట్టి పంపిస్తారని తెలిపారు. కానీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వమే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నదని గుర్తు చేశారు. ఒకవేళ ఇదే షెడ్యూల్ పాటించాలనుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అందించాల్సి ఉంటుందని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థినులకు రవాణా సౌకర్యం, భద్రత కల్పించాలని తెలిపారు. పరీక్షల మధ్య విరామం లేకుండా ఒకదానివెంట మరొకటి నిర్వహించడం పూర్తిగా ఆశాస్త్రీ యమని విమర్శించారు. ప్రశ్నల ఛాయిస్ విధానం కూడా ఎక్కువ కఠినతరంగా ఉందనీ, తరగతి స్థాయికి తగినట్టుగా దానిని మార్చా లని కోరారు. ప్రశ్నల సంఖ్యను కూడా పరీక్ష సమయానికి అనుగుణంగా సరి చేయాలని పేర్కొన్నారు.