Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టులు 544
- 31 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- టీఎస్పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. 2022, డిసెంబర్ 31న ఏడాది చివరి రోజు 806 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో నాలుగు నోటిఫికేషన్లను జారీ చేసింది. కళాశాల విద్యాశాఖ పరిధిలోనే 544 అధ్యాపక, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రెరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో అధ్యాపక పోస్టులు 491, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 29, లైబ్రెరియన్ పోస్టులు 24 ఉన్నాయని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 31 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. వాటి సమర్పణకు వచ్చేనెల 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువుందని వివరించారు. మల్టీజోన్-1 పరిధిలో 246, మల్టీజోన్-2 పరిధిలో 298 కలిపి మొత్తం 544 పోస్టులను భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. మే లేదా జూన్లో నియామక పరీక్ష ఉంటుందని ప్రకటించారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు
ఇంగ్లీష్-23, తెలుగు-27, ఉర్దూ-2, సంస్కృతం-5, స్టాటిస్టిక్స్-23, మైక్రో బయాలజీ-5, బయో టెక్నాలజీ-9, అప్లయిడ్ న్యూట్రిషన్-5, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్-311, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-39, కామర్స్-బిజినెస్ అనలిటిక్స్ (స్పెషలైజేషన్)- 8, డెయిరీ సైన్స్-8, క్రాప్ ప్రొడక్షన్-4, డేటా సైన్స్-12, ఫిషరీస్-3, కామర్స్ ఫారిన్ ట్రేడ్ (స్పెషలైజేషన్)-1, కామర్స్ టాక్సేషన్ (స్పెషలైజేషన్)-6, ఫిజికల్ డైరెక్టర్-29, లైబ్రెరియన్-24.
పురపాలక శాఖలో 78 పోస్టులు
పురపాలక శాఖలో 78 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులున్నాయని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఈనెల 20 నుంచి వచ్చేనెల 11 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
విద్యాశాఖలో 71 లైబ్రెరియన్ పోస్టులు
విద్యాశాఖ పరిధిలో 71 లైబ్రెరియన్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ను విడుదల చేసినట్టు కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఇంటర్ కమిషనరేట్ పరి ధిలో 40 లైబ్రెరియన్ పోస్టులు, సాంకేతిక విద్యాశాఖ పరిధి లో 31 లైబ్రెరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొ న్నారు. ఈనెల 21 నుంచి వచ్చేనెల పదో తేదీ వరకు దర ఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు షషష.్రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.
113 ఏఎంవీఐ పోస్టులు
113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేశామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఏప్రిల్ 23 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వివరించారు. మే లేదా జూన్లో నియామక పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.