Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త ఏడాదిలోనూ కొనసాగిస్తాం
- ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : మహేష్‌కుమార్‌గౌడ్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పక్షాన గత సంవత్సరంలో ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశామనీ, కొత్త సంవత్సరంలోనూ కొనసాగిస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనలో పబ్లిక్ 2022లో సంతోషంగా లేరని చెప్పారు. విద్యార్థులు, కార్మికులు, రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు మనపోరు అనేక పోరాటంతో ప్రజల్లోకి వెళ్లామని చెప్పారు. రాహుల్ భారత్ జోడో యాత్ర, వరంగల్ రైతు డిక్లరేషన్, వరి దీక్ష వంటి అనేక ఉద్యమాలు చేశామని తెలిపారు. 42 లక్షల డిజిటల్ మెంబర్షిప్ చేశామనీ, కాంగ్రెస్ మెంబర్ షిప్ వున్న వారికి రెండు లక్షల చొప్పున ప్రమాదభీమా ఇస్తున్నామని తెలిపారు. అనిల్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామిని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. మత సామరస్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పారు. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.