Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
- ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో డీజీపీ కార్యాలయం ఉద్రిక్తత
నవతెలంగాణ- హిమాయత్‌నగర్
నెల రోజులుగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. ఎస్ఐ, కానిస్టే బుల్ అభ్యర్థుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనా డాలన్నారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తా నుంచి చేపట్టిన చలో డీజీపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లా డుతూ.. ప్రశ్నాపత్రాల్లో తప్పులను గమనించిన హైకోర్టు ఏడు మార్కులు కలపాలని తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అన్నారు. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి నిర్దేశించిన ఈవెంట్ పూర్తిగా అశాస్త్రీయంగా ఉందన్నారు. మూడు ఈవెంట్స్‌లో ఏ రెండు ఈవెంట్స్‌కు అర్హత సాధించినా ఉద్యోగ అర్హత ఇవ్వాల్సి ఉండగా.. అందుకు నిరాకరిస్తుండటంతో లక్షలాది మంది అభ్యర్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు.
తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు తయారు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అశాస్త్రీయమైన పద్ధతిలో ఉన్న ఫిజికల్ ఈవెంట్స్ కొలమానాన్ని తక్షణమే మార్చి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. మల్టిపుల్ ప్రశ్నల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను అమలు చేయాలని, తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలపాలని, ఈవెంట్స్‌ను పాత పద్ధతిలోనే నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రెహమాన్, గ్యార క్రాంతి, గ్యార నరేష్, సత్య నెల్లి, ఉప్పల ఉదరు కుమార్, వల్లమల్ల ఆంజనేయులు, చైతన్య, వంశీ, వెంకటేష్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.